ప్రభుత్వ కోరిక మేరకే స్వయంసేవకుల సహకారం 

స్వయంసేవకులు కేవలం స్థానిక అధికారుల కోరిక మేరకే వారికి సహకారం అందిస్తారు తప్ప మొత్తం పనిని తమ చేతుల్లోకి తీసుకోరని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ స్పష్టం చేశారు. 

స్వయం సేవకులు ప్రభుత్వం ఉద్యోగుల విధుల్లో జోక్యం చేసుకొని, ఐడి కార్డులు తనిఖీ చేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆయన తీవ్రంగా ఖండించారు 

పకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు సహజంగానే సహాయ కార్యక్రమాలలో నిమగ్నం అవుతారని, వివిధ సంస్థలతో పాటు పని చేస్తూ ప్రజలకు సహాయం అందిస్తారని ఆయన వివరించారు. 

చైనా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడం కోసం కూడా స్వయం సేవకులు వివిధ సేవ, సహాయ కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు. 

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్వయం సేవకులు 369 స్థలాల్లోజరుగుతున్న కార్యక్రమాల ద్వారా 25,000 కుటుంబాలను ఆడుకున్నారని రమేష్ చెప్పారు. ఈ కార్యక్రమాలలో 2678 మంది స్వయం సేవకులు పాలుపంచుకొన్నారని పేర్కొన్నారు. 

వివిధ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు కలసి స్వయంసేవకులు పనిచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ సిబ్బంది కోరిన మీదట వారికి సహకారం అందిస్తున్నారని తెలిపారు.