ప్రధాని మోదీ ఈస్టర్‌ పర్వదిన శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు ఈస్టర్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ... ఈస్టర్‌ ప్రత్యేక పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు అని చెప్పారు. 

ఈ సందర్భంగా మనందరం క్రీస్తు గొప్ప ఆలోచనలను గుర్తుచేసుకుందామని సూచించారు. ముఖ్యంగా అవసరార్థులను, పేదలను ఆదుకునేందుకు వారిని శక్తిమంతులను చేయడంలో ఆయనకున్న అచంలమైన నిబద్ధతను మనం గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు. 

ఈస్టర్‌ కోవిడ్‌-19ను విజయవంతంగా ఎదుర్కొనేందుకు అదేవిధంగా భూమిని ఆరోగ్యవంతమైన గ్రహంగా మార్చేందుకు అదనపు బలాన్ని ఇవ్వాల్సిందిగా వేడుకుందామని చెప్పారు. గుడ్‌ఫ్రైడే నాడు శిలువ వేయబడ్డ ఏసుక్రీస్తుకు ఆదివారం పునరుజ్జీవితుడవుతాడు. ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఈస్టర్‌ వేడుకను జరుపుకుంటారు.