మరోసారి తడబడిన డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా విషయంలో వ్యవహరించిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రవేశాలు వాస్తు ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తడబడుతుంది. అదే విధంగా భారత్ పై అనవసరపు వాఖ్య చేసి సరిచేసుకొంది. 

కరోనా వ్యాప్తిలో భారత్ మూడో దశలోకి అడుగు పెట్టిందని ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ తన నివేదికలో పేర్కొంది. అయితే ఆ నివేదిక తప్పని, భారత్ ఇంకా మూడో దశకు చేరుకోలేదని, కేవలం క్లస్టర్ ఆఫ్ కేసెస్ (ఒక ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదవడం) దశలోనే ఉందని తాజా నివేదిక ద్వారా సవరించుకొంది. 

కరోనా వ్యాప్తిలో భారత్‌మూడో దశకు చేరుకుందనే విషయాన్ని భారత వైద్య పరిశోధనా విభాగం (ఐసీఎంఆర్)తో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా ఖండించాయి. నమోదవుతున్న కేసుల్లో 20 నుంచి 30 శాతం మందికి ఎవరి ద్వారా కరోనా వ్యాప్తి చెందిందో తెలియకుండా ఉన్నప్పుడు లేదా దానికి కారణమైన వారికి గుర్తించలేనప్పుడు మాత్రమే మూడో దశ ప్రవేశించినట్లని హితవు చెప్పింది. 

ఆ దశ ఇంకా దేశంలోకి ప్రవేశించలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఒకవేళ దేశంలో కరోనా మూడో దశకు చేరుకుంటే దానిని ప్రజల నుంచి దాచడం అసాధ్యమని కూడా పేర్కొన్నది