తెలంగాణలో మాస్క్‌లు తప్పనిసరి 

తెలంగాణలో మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే కచ్చితంగా మాస్క్‌లు వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

 వైరస్‌ సోకినా చాలా మందికి లక్షణాలు కనబడవని, అలాంటివారు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. వైరస్‌ సోకకుండా రక్షణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమని అధికారులు  స్పష్టం చేస్తున్నారు. 

ఆఫీసులు, పని చేసే ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ఉపయోగించాలని, రెండు పొరలు ఉన్న కాటన్‌ వస్త్రాన్ని కూడా వాడొచ్చని ప్రభుత్వం చెబుతోంది. 

 ఓ అధ్యయనం ప్రకారం మాస్కుల వినియోగంతో జపాన్‌లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినట్లుగా సమాచారం. దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయాల్లో వెలువడే తుంపర్లు అవతలి వ్యక్తిపై పడటంతో కోవిడ్‌-19 భారిన పడుతున్నారు. దీని నివారణకు మాస్కుల వినియోగం ఎంతో ఉపయుక్తమని తెలిపింది.

రెండు పొరలుగా ఉండే కాటన్‌తో చేసిన మాస్కుల వినియోగం ఆమోదయోగ్యంగా పేర్కొంది. ముక్కు, నోరు, గదవ ను కవర్‌ చేసే విధంగా మాస్కులు ఉండాలంది. అదేవిధంగా మాస్కుకు, ముఖానికి ఖాళీ ఉండొందని వెల్లడించింది.  

గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు మాస్క్‌లు వాడాలని, మూతి, ముక్కు, గడ్డం పూర్తిగా కప్పేలా మాస్క్‌ ధరించాలని అధికారులు పేర్కొన్నారు. చేతులు కడుక్కోని మాస్క్‌ వేసుకోవాలని, మాస్క్‌లు ఒకసారే వినియోగించాలని, వాషబుల్‌ మాస్క్‌లు ధరించడం మేలని ప్రభుత్వం సూచిస్తోంది.