ఏప్రిల్ 22 నాటికి కరోనా లేని తెలంగాణ 

ఏప్రిల్ 22 నాటికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఉండకబోవచ్చని, కరీనా లేని తెలంగాణగా ఉండవచ్చని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రవీందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో గురువారం 18 కొత్త కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. గురువారం  665 నమూనాలలో 18 మందికి పాజిటీవ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఒకరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.  మరొకరు మృతి చెందారు. 

ప్రస్తుతం 414 మందికి గాంధీలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం 70 మందిని డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 22 నాటికి కరోనా బాధితులు పూర్తిగా డిశ్చార్జ్ అవుతారు. 

ఢిల్లీ మర్కజ్ కేసులు లేకుంటే గత నెలలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించినట్లు ఏప్రిల్ 7 నాటికే కరోనా లేకుండా తెలంగాణ ఉండెడిది. గాంధీలో కేవలం కరోనా పాజిటీవ్ ఉన్న వారికే చికిత్స అందిస్తున్నారు. ఓపి కోసం కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్ళమంది చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.