కరోనా కట్టడిలో ప్రపంచ నాయకత్వం విఫలం 

కరోనాను అడ్డుకోవడంలో ప్రపంచ నాయకత్వం విఫలమైన్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్రావు స్పష్టం చేశారు. ఊహించని ఈ పెనుముప్పును నియంత్రించడంలో అమెరికా నాయకత్వంలోని దేశాలు ఎంత నిరక్ష్ల్యంగా, అసమర్థంగా వ్యవహరించాయో స్పష్టంగా తెలుస్తున్నట్లు తెలిపారు. 

ఇది అంతర్జాతీయ నాయకత్వపు చారిత్రాత్మక సంక్షోభం, ఆర్ధిక, సామజిక, రాజకీయ, సైనిక పరంగా ఆధిపత్యం వహిస్తున్న దేశంలో పరిస్థితులు చూస్తుంటే వాటికి ముందుచూపు కొరవడినట్లు స్పష్టం అవుతున్నదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందామంటూ చెప్పుకునే ప్రజాస్వామ్య ‌‌‌దేశాల్లో పాలనాపరమైన, వ్యవస్థాగతమైన లోపాల జాబితా చాంతాడంత ఉందని పేర్కొన్నారు. 

చాలా దేశాల్లో పరిపాలనను రాజకీయాలు అతిక్రమించాయని ఎన్నికలు లేని సమయంలో కూడా మంచి పాలన అందివ్వడం వదిలి రాజకీయాలు చేయడం సాధారణమై పోయిందని అంటూ సర్వత్రా ఈ ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  కరోనా లాంటి క్రిటికల్‌‌‌‌ టైంలో దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడేందుకు సమగ్ర వ్యూహం రూపొందించే విజన్‌‌‌‌ లేకపోవడం దీనికి ఉదాహరణ అని చెప్పారు. 

ప్రపంచ దేశాలు తమ వద్ద కరోనా సోకినప్పుడు సకాలంలో స్పందించకుండా రాజకీయాల్లో మునిగితేలుతూ ప్రజలను పెద్ద సంక్షోభంలోకి నెట్టివేసిన్నట్లు కృష్ణసాగర్రావు విమర్శించారు. ఈ మహమ్మారిని కట్టడి  చేసేందుకు ఒక్కటిగా ప్రయత్నించకుండా నాలుగైదు వారాలపాటు డైలమా కొనసాగించాయని, అందుకు ఇప్పుడు భారీమూల్యం చెల్లించుకోవలసి వస్తున్నదని చెప్పారు. 

200 నుంచి 500 ఏండ్లుగా సంఘటిత పాలన ఉందని చెప్పుకునే దేశాల్లో కూడా సరైన సామజిక సమతుల్యం,  అన్ని వర్గాల్లో కలుపుగోలుతనం, ఆర్థిక భద్రత ఇప్పటికీ కనిపించడం లేదు. అవన్నీ ఉండి ఉంటే ఈ  సంక్షోభ సమయంలో కొంత ఉపశమనం కలిగి ఉండేదని ఆయన తెలిపారు. 

పేదల రోజువారి అవసరాలు, దేశ ప్రయోజనాలకంటే మత విశ్వాసాలకు ప్రాధాన్యత ఇవ్వడం, సరైన విద్య, శక్తిమంతమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేకపోవడం, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి తగిన వ్యక్తిగత రక్షక పరికరాలు అందుబాటులో లేకపోవడం, మందుల కొరత వంటివి అభివృద్ధిలో తరాలకు సూచికలని ఆయన వివరించారు. 

ప్రస్తుత కరోనా ఉపద్రవాన్ని ఒక అవకాశంగా మలచుకోవాలని ఆయన సూచించారు. ఈ సంక్షోభం అనంతరం కొత్త ప్రపంచం వైపు చూడాలని, కొత్త ప్రపంచ నాయకత్వం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇళ్లకే పరిమితం కావడం పట్ల 84 శాతం భారతీయులు సుముఖంగా ఉన్నారు.  మొత్తం భారత్‌తో సహా 14 దేశాల్లో ప్రతీ 5 మందిలో నలుగురు ఇంట్లో ఉండడానికే ఇష్ట పడుతున్నారని సర్వే జరిపిన ఇప్సోస్ ఇండియా పేర్కొంది. 

అయితే ప్రపంచంలో అధిక భాగంలో దేశాలు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయని తెలిపింది. కాగా రష్యా, వియత్నాం, ఆస్ట్రేలియా ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారని సర్వేలో వెల్లడించింది. 

ఇక దేశాల వారిగా చూస్తే స్పెయిన్‌ 95 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో వియత్నాం (94శాతం), ఫ్రాన్స్‌ (90 శాతం), బ్రెజిల్‌ (89 శాతం), మెక్సికో ( 88 శాతం), రష్యా (85 శాతం)లు ఉన్నాయి. కాగా భారత్‌ ఈ జాబితాలో అమెరికాతో సంయుక్తంగా 84 శాతంతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది.

అంతేగాక 15 దేశాల్లో దాదాపు 14 దేశాల ప్రజలు హోమ్‌ క్వారంటైన్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇంట్లో ఉంటేనే కరోనా బారీ నుంచి రక్షించుకోగలమని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా ఏప్రిల్‌ 2 నుంచి 4 వరకు 28వేల మంది సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు ప్రాధాన్యమిచ్చారని, ఇందులో జపాన్‌ నుంచి తక్కువ సంఖ్యలో ఉన్నారని తేలింది.

'ఇది చాలా అపూర్వమైన కాలం. చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచంలోని మిగతా దేశాలకు వేగంగా విస్తరిస్తూ మహమ్మారిగా మారింది. కరోనా దూకుడును అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. మెజారిటీ భారతీయులు ఇంట్లో ఉండడం ద్వారా లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా పాటిస్తున్నారంటూ' ఇప్సోస్ ఇండియా సీఈవో అమిత్ అదార్కర్ తెలిపారు.