అధికారులపై టీఆర్‌ఎస్, ఎంఐఎం వత్తిడి తగదు 

కరోనా  మహమ్మారి కట్టడికి విశేషంగా కృషి చేస్తున్న తెలంగాణలోని ప్రభుత్వ అధికారులపై రాజకీయ జోక్యం తగదని బీజేపీ ఎంపీ డి అర్వింద్ హితవు చెప్పారు. రాష్ట్రంలో మరి కొన్ని వారాలు లాక్ డౌన్  కొనసాగే అవకాశం ఉన్నందున అధికారులకు సహకరించాలని ముఖ్యంగా టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతలకు విజ్ఞప్తి చేశారు. 

మార్కజ్ వెళ్లిన వారి కారణంగానే నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించిందని చెబుతూ ప్రస్తుత కీలక సమయంలో అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడి సరైంది కాదని స్పష్టం చేశారు. అధికారులకు అన్ని పార్టీల వారు, ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా కరోనా అనుమనితులను క్వారైంటైన్ కు తరలించేందుకు సహకరించాలని చెప్పారు. 

జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్ కన్నా తెలంగాణలోనే కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం పట్ల అర్వింద్ ఆందోళన వ్యక్తం చేశారు.  కరోనా కట్టడి చేసే విషయంలో అధికారులకు స్వతంత్రత ఇవ్వాలని స్పష్టం చేశారు. అందరూ ఇళ్లలోనే ఉండి… లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. 

కరోనాపై కేంద్రం ఎప్పటి కప్పుడు పార్లమెంట్ సభ్యులతో చర్చిస్తోందన్న అర్వింద్ రాజకీయాలకు అతీతంగా వైరస్ పై పోరాటం చేయలన్నారు.ని సూచించారు. 

మరోవైపు రైతులను ఆదుకోవడంలో తెలంగాణ  ప్రభుత్వం విఫలమైందని అరవింద్ ఆరోపించారు.  గన్నీ బ్యాగ్ లు కూడా అందించడం లేదని మంది పడ్డారు. కొనుగోలు కేంద్రాల  దగ్గర రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.