కేంద్రం చర్యలతో ప్రజల వద్దకు బిజెపి ఎంపీలు

కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ చేపట్టిన సహాయక కార్యక్రమాలు, నిర్ణయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ తమ పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలను బీజేపీ కోరింది. 

కోవిడ్-19ను అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రజల్లోకి వెళ్లి తెలియజేయాలనీ.. వార్తా పత్రికలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించింది. 

ఈమేరకు ఇప్పటికే బీజేపీ తమ ఎంపీలందరీకి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దీని ద్వారా సంభవించే ఆర్ధిక ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కునేందుకు కేంద్రం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.