కుప్పకూలనున్న అంతర్జాతీయత.. జాతీయవాదమే మార్గం 

చైనా నుండి ఆరంభమై  నేడు మొత్తం ప్రపంచాన్ని ముంచెత్తుతున్న కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముందు నాటి పరిస్థితులు నెలకొంటున్నాయి. 

ఏ దేశానికా దేశం తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ద్వైపాక్షిక సంబంధాల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఉంది. జాతీయవాదమే రానున్న రోజులలో అంతర్జాతీయ వ్యవస్థలను నడిపించనున్నది. 

కరీనా వైరస్ గురించి తగు సమాచారం ఇవ్వకుండా తమను పెద్ద ఉపద్రువంలోకి నెట్టివేసిన్నట్లు నేడు ప్రపంచ దేశాలు నేడు చైనాను దోషిగా చూస్తూ ఉండడంపై నిపుణులు ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఢిల్లీ కేంద్రంగా గల ఆలోచనాపరుల వేదిక విచార వినిమయ్  కేంద్ర  వెబనార్ సమాశంలో ఈ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఆధ్వర్యంలో "చైనీస్ కరోనా : మూలం, వ్యాప్తి, ప్రభావం" అంశంపై జరిగిన చర్చలో ఆసక్తికర అంశాలు  ప్రస్తావనకు వచ్చాయి. 

ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పక్షపాతంగా వ్యవహరించిన్నట్లు ఆరోపణలు చెలరేగడం గమనార్హం. ఇక రాబోయే రోజులలో ఐక్యరాజ్యసమితి, యుఎన్ మానవ హక్కుల మండలి వంటి అంతర్జాతీయ సంస్థల నిర్వహణకు సమకూరుస్తున్న నిధులు తగ్గిపోతాయని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు నితిన్ ఎ గోఖలే భావిస్తున్నారు. 

ప్రపంచంలో సంపన్న దేశాలుగా పేరొందిన జి-20 దేశాలలో కరోనా కారణంగా జిడిపి 10 నుండి 20 శాతం మేరకు పడిపోయే అవకాశం ఉన్నందున అవి అంతర్జాతీయ వ్యవహారాల పట్ల ఇక ఆసక్తి కనబరచి అవకాశం ఉండదు. 

ఏ దేశానికా దేశం తమ జాతీయ ప్రయోజనాలపై దృష్టి సాచి, నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుండవలసిందే అని ఢిల్లీ లోని అభివృద్ధి చెందిన దేశాల  పరిశోధన,సమాచార వ్యవస్థ (ఆర్ ఐ ఎస్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది స్పష్టం చేశారు. 

ఇక ఇప్పుడు చైనా పట్ల అంతర్జాతీయంగా వివిధ దేశాల ఆలోచనలు తలకిందులు కావడంతో, ఆ దేశానికి దూరం కావడానికే అందరు ప్రయతించే అవకాశం ఉంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ మరో సారి అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనా వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలకు పాలపడే అవకాశం ఉంది.

మరో వంక ఇప్పటికే ఆస్ట్రేలియా రాజకీయాలలో జోక్యం చేసుకొంటూ అక్కడ చైనా సృష్టించిన అలజడి కారణంగా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురు కాక తప్పదు. ఇటువంటి పరిస్థితులలో తన ఆర్ధిక ప్రయోజనాలు కాపాడుకోవడం పట్లనే చైనా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు చతుర్వేది తెలిపారు. 

ఇప్పటికే ప్రపంచంలో ఎటువంటి సంక్షోభం ఎదురైనా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడమే కాకుండా, సమస్యలను పారింత విషమించేందుకు దోహదపడుతున్నాయి. దానితో అంతర్జాతీయ వ్యవస్థలకు కాలం చెల్లి, కరోనాతో నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం ఏర్పడనుంది.