ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం సడలింపు 

ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాల నిబంధనలను సడలించింది. ఈ నిర్ణ యం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. 

సెప్టెంబర్‌ 30 వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, దెబ్బతిన్న రాష్ట్రాల ఆదాయం, పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. 

ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం గడువునూ 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచింది. త్రైమాసికంలో ఇది 50 రోజులకు మించరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది 36 రోజులుగానే ఉన్నది. బ్యాంక్‌తో చేసుకునే రుణ ఒప్పందమే ఈ ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం. 

దీనివల్ల తమ ఖాతాలో ఉన్న మొత్తాల కంటే ఎక్కువ నగదును తీసుకునే వెసులుబా టు ఖాతాదారులకు వస్తుంది. అయితే అనుమతించిన మేరకే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. 

ఇదిలా ఉరడగా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలపైనా రిజర్వ్‌బ్యారకు కీలక నిర్ణయాన్ని తీసుకురది. వారు చెల్లించాల్సిన రుణం వాయిదాలు, వడ్డీలపై కూడా మారటోరియం ప్రకటిరచింది.