ముమ్మాటికీ చైనా వైరస్... చైనా నిర్లక్ష్యంతోనే ఉపద్రవం

నేడు ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేస్తున్న కరోనా వైరస్ ముమ్మడితి చైనీస్ వైరస్ అని,  నేడు ఈ ఉపద్రవానికి ఆ దేశమే బాధ్యత అని సీనియర్ జర్నలిస్ట్, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు నితిన్ ఎ గోఖలే స్పష్టం చేశారు. 

ఢిల్లీ కేంద్రంగా గల ఆలోచనాపరుల వేదిక విచార వినిమయ్ కేంద్ర ఆధ్వర్యంలో "చైనీస్ కరోనా : మూలం, వ్యాప్తి, ప్రభావం" అంశంపై జరిగిన వెబనార్ సమావేశంలో మాట్లాడుతూ చైనా నిర్లక్ష్యంతో ఈ వైరస్ ప్రపంచం అంతా వ్యాప్తి చెండాడానికి కారణమైన్నట్లు తెలిపారు. 

ప్రపంచ దేశాలనే కాకుండా, తమ దేశపు ప్రజలను కూడా చైనా హెచ్చరింపలేదని, స్వదేశంలోనే ప్రభుత్వ వ్యవహారం పట్ల తీవ్ర నిరసనలు నేడు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏకపక్షంగా, చైనా వత్తిడులకు లొంగి వ్యవహరించిందనే విమర్శలు చెలరేగుతున్నాయని గుర్తు చేశారు. 

2019 డిసెంబర్ 7నే దీని గురించి చైనాకు తెలుసని, కేవలం డిసెంబర్ 31న మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అంతుబట్టని నుమేనియా వ్యాపించిన్నట్లు తెలిపినదని చెప్పారు. జనవరి 11న థాయిలాండ్ కు వెళ్లి, తిరిగి వచ్చిన ఒక చైనా మహిళా మృతి చెందిన తర్వాత మాత్రమే ఏదో వైరస్ వ్యాప్తి చెందిన్నట్లు చెప్పిన్నట్లు గుర్తు చేశారు. 

రోగులకు వైద్యం చేసిన, ఈ వైరస్ గురించిన వైద్యులను చైనా వేధించిన్నట్లు తెలిపారు. వారి నుండి వ్రాతపూర్వక క్షమాపణలు తీసుకున్నారని చెప్పారు. ఈ వైరస్ ఉన్న సమయంలోనే ప్రపంచ రికార్డు నమోదు చేయడం కోసం 40,000 మందితో ఒక విందు ఏర్పాటు చేసారని, దానిలో పేరొందిన చైనా మాంసపు ఆహార పదార్ధాలను వడ్డించారని పేర్కొన్నారు. 

పైగా ఇదే సమయంలో లూనార్ ఉత్సవాల సందర్భంగా సెలవులకు చైనా వ్యాపారాలు, విద్యావేత్తలు, విద్యార్థులు, ఇతరులను ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలకు పంపారని అంటూ వారే ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాలలో ఈ వైరస్ వ్యాప్తికి కారకులయ్యారని వివరించారు.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు ఈ వైరస్ కారణంగా చైనాలో లక్షలాది మంది చనిపోవడం వాస్తవం కాకపోయినప్పయిటీకి, ప్రస్తుతం చైనా చెబుతున్న అంకెలు కూడా వాస్తవం కాదని నితిన్ గోఖలే స్పష్టం చేశారు. ఇప్పటికి కూడా చైనా వాస్తవాలు చెప్పడం లేదని, వాస్తవాలను కప్పిపుచ్చుతున్నదని విమర్శించారు. 

ఈ విషయమై చైనా అధ్యక్షుడు క్సి జిన్ పింగ్ వ్యవహరించిన తీరు పట్ల ఆ దేశంలో కీలక వ్యక్తులే అసంతృప్తిగా ఉన్నారని, కొన్ని రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా ఘర్షణలు జరిగాయని అంటూ అంతర్గతంగా చైనాలో అలజడులకు కూడా కారణం కావచ్చని తెలిపారు.

 ఏది ఏమైనా తక్కువ ధరకు పారిశ్రామిక ఉత్పత్తులు, ముడి పదార్థాలు, కార్మికులను అందిస్తూ ఉండడంతో ఆ దేశం పట్ల మొగ్గు చూపుతున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు క్రమంగా వెనుకడుగు వేయక తప్పదని, అందుకు భారీ మూల్యం చెల్లించుకో వలసి వచ్చిన్నట్లు గుర్తించక తప్పదని వెల్లడించారు.