పలు రాష్త్రాలలో పెట్రోల్, డిజేల్ ధరల తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటర్ కు రూ 2.50 మేర తగ్గించడంతో, పలు బిజెపి పాలిత రాష్త్రాలు సహితం మరో రూ 2.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దానితో వినియోగదారులకు లీటర్ కు రూ 5 మేర ఉపసమనం లభించిన్నట్లు అయింది.

కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే బిజెపి పాలిత రాష్ట్రాలయిన ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, అసోం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర ప్రభుత్వాలు పెట్రో ధరలపై రూ.2.50 చొప్పున తగ్గిస్తునట్లు ప్రకటించాయి. దీంతో మొత్తంగా రూ.5తగ్గినట్లైంది. దీ

నిపై స్పందించిన ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ‘ప్రజల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేసింది. ‘1000 గాయాలు చేసిన తర్వాత కేంద్ర సర్కారు ఒక్క బ్యాండేజ్ వేసే ‌ప్రయత్నం చేస్తోంది. 2014లో పెట్రో ధరలు ఉన్నరేటుకి ఇప్పుడు అందించగలరా?’ అని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా సవాలు విసిరారు.

కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రూ.10 చొప్పున తగ్గించాలని పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఆమె గత నెల లీటర్ కు ఒక రూపాయి మాత్రమె తగ్గించడం గమనార్హం.