హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులకు సిద్ధం 

అగ్రరాజ్యం అమెరికాతో పాటు 30 కరోనా బాధిత దేశాల అభ్యర్ధన ఆమేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్ లను అత్యవసరంగా అవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవతా కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

పారాసిటమాల్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తగిన పరిమాణంలో పొరుగు దేశాలకు సరఫరా చేస్తామని చెప్పింది. ఈ మందులను అత్యవసరంగా అవసరమున్న దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటించింది. అయితే భారత దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే మాత్రమే వెసులుబాటును బట్టి ఎగుమతి చేస్తామని భారత్ స్పష్టం చేసింది. 

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాలని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం విదితమే. బ్రెజిల్‌, స్పెయిన్‌తో సహా కరోనా ప్రభావవంతంగా ఉన్న దేశాలు ఈ మందులను సరఫరా చేయాలని కోరాయి. ఈ మందుల సరఫరాను రాజకీయం చేయొద్దని కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. 

కరోనా దృష్ట్యా దేశంలో ఔషధాల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మార్చి 3న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ తాజాగా మరో నోటిఫికేషన్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ జారీ చేసింది.  12 రకాల యాంటీ బయోటిక్స్‌, 12 రకాల ఫార్ములేషన్లపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఇలా ఉండగా,  సడలించింది. 

కాగా, క‌రోనా బాధిత దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. భార‌త సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రపంచంలోని ఇత‌ర దేశాల‌తో పోల్చితే క‌రోనాను చాలా వ‌ర‌కు భార‌త్ క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. దేశంలో క‌రోనా వ్యాప్తి విజృంభించ‌కుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు  అమెరికా ప్ర‌శంసించింది.  

క‌రోనా వైర‌స్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మందు లేక‌పోవ‌డంతో క‌రోనా తీవ్ర ప్ర‌భావిత దేశాలు  ఆందోళ‌న చెందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో  భారత్‌లో మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ‍ క్లోరోక్వీన్‌తో పాటు పారాసిటమాల్‌ మెడిసిన్ ను కరోనా బాధితులకు అందిస్తున్నారు. 

సార్క్ దేశాలతో పాటు మరో 30 దేశాలు కూడా  భార‌త్‌ నుండి హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌ మందుల  ఎగుమ‌తి   ఎదురు చూస్తున్నాయి. హైడ్రా​క్సీ ‍క్లోరోక్వీన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు సహాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో మానవతా దృక్పథం తో సరఫరా పై ఉన్న నిషేధాన్ని సడలించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.