10 మంది ఇండోనేసియన్లపై కేసు

కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మతపరమైన సమావేశాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. 

ఈ విషయంపై కరీంనగర్ స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని,   దాంతో  ఆ  ఇండోనేసియన్లపై   సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. 

కరీంనగర్‌కు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. సెక్షన్‌ 420, 269, 270, 188, యాక్ట్ 1897 సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేశారు.