ఐసియులో బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్   

కరోనా బారిన పడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు వ్యాధి తీవ్రత పెరగడంతో జాన్సన్‌ను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డోమినిక్‌ రాబ్‌ వెల్లడించారు. మార్చి 27 నుంచి జాన్సన్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు 

లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అదే రోజు ఆయన ఆస్పత్రిలో చేరారు. 

 బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా స్పందించారు. బోరిస్‌కు మంచి వైద్యం అందేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం కొంత విషమంగా ఉందని వార్తలు రావడంతో బ్రిటన్‌ వాసుల్లో ఆందోళన మొదలైంది.    

ఆయ‌న త‌న బాధ్య‌త‌ల‌ను ఆ దేశ విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు డిప్యూటీగా చేయాల‌ని డామినిక్‌ను బోరిస్ కోరారు.