ఒకపూట భోజనాన్నిత్యజించమన్న నడ్డా 

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంఘీభావంగా ఒకపూట భోజనాన్నిత్యజించాలని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి బీజీపీ కార్యకర్త 40 మందిని కలిసి ఒక్కొక్కరు రూ. 100 చొప్పున పీఎం కేర్స్‌ ఫండ్‌కి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్స్‌లు, బ్యాంక్‌ ఉద్యోగులు, పోస్ట్‌మ్యాన్‌లకు మనమందరం కృతజ్ఞతలు తెలిపాలన్నారు.   

కరోనా  కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలను అందరూ అభినందిస్తున్నారని నడ్డా కొనియాడారు. ఈ విపత్కర పరిస్థితులను మోదీ ఎలా ఎదుర్కుంటారు అని ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తోందని పేర్కొన్నారు. 

కేవలం 40 సంవత్సరాల్లోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి
భారతీయ జనతా పార్టీ బలమైన స్తంభంలా మారిందని పార్టీ మాజీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ చూరగొందని  సంతోషం వ్యక్తం చేశారు. 

1977లో విధించిన అత్యవసర పరిస్థితి తరువాత జరిగినలోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పై ఐక్య పోరాటం చేయడానికి జనతా పార్టీతో విలీనం అయిన జనసంఘ్‌ పార్టీ నాయకులు 1980  లో ఏప్రిల్ 6 న బీజేపీని స్థాపించారు.