5 నిమిషాలల్లో రిజల్ట్ వచ్చే కిట్లు    

కరోనా పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం జరుపుతున్న పరీక్షల ఫలితాలు రావడానికి ఐదారు గంటల సేపు పట్టడమే కాకుండా, అందుకు అవసరమైన కిట్ల లభ్యత కూడా తక్కువగా ఉంది. దానితో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్ట దలచిన హాట్‌స్పాట్‌ ప్రాంత ప్రజలు, అనుమానితులకు ర్యాపిడ్ డయాగ్నసిస్‌ టెస్ట్‌ (ఆర్డీటీ) ద్వారా పరీక్షా చేయాలనీ నిర్ణయించారు.

ఈ పద్దతిలో ఐదు నిముషాలలో అక్కడికక్కడే ఫలితాలు రాగలవు. తొలుత అనుమానితుల రక్తాన్ని పరీక్షించి, కరోనా ఉన్నదీ లేనిదీ ప్రాథమికంగా నిర్థారిస్తారు. ఐదు, పది నిమిషాల్లోనే ఈ టెస్ట్‌ ఫలితం వచ్చేస్తుందని అధికారులు చెబుతున్నారు. 4 లక్షల టెస్టింగ్ కిట్లను ఆర్డర్ చేశామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇందులో మెజారిటీ కిట్లు ఆర్డీటీర్డీ కి సంబంధించినవేనని అధికారులు తెలిపారు. 

ఆర్డీటీర్డీ పాజిటివ్ వస్తేవెంటనే ఐసోలేషన్‌కు తరలిస్తారు. గొంతు ముక్కులోంచి ద్రవాలను సేకరించి ఆర్టీ పీసీఆర్ ర్టీ టెస్టు చేస్తారు. ఈ టెస్టు రిజల్ట్ ఆధారంగా వైరస్ సోకిందీ, లేనిదీ చివరిగా నిర్ధారిస్తారు. ఒకవేళ ఆర్డీటీలో నెగెటివ్ వచ్చి, జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఉంటే 14 రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.