క‌రోనా చీక‌ట్ల‌ను చీల్చుకుంటూ దీపాలు    

దేశ‌మంతా దివ్య‌జోతులు వెలిగాయి.   ప్ర‌మిదలు.. కొవ్వొత్తులు.. టార్చ్‌లైట్లు.. మొబైల్ లైట్ల రూపంలో.. 130 కోట్ల మంది మ‌హాసంక‌ల్పంతో ఆశాదీపాల‌ను వెలిగించారు.  క‌రోనా వైర‌స్‌తో అంధ‌కారంగా మారిన ప్ర‌పంచాన్ని మ‌ళ్లీ క్రాంతి ప‌థంలో న‌డిపేందుకు దేశ ప్ర‌జ‌లంతా ఉల్లాసంగా, ఉత్సాహాంగా దీపాలు జ్వ‌లించారు. 

కరోనాపై పోరాటానికి సంఘీభావంగా సంక‌ల్ప దీపాన్ని వెలిగించాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపున‌కు దేశ‌మంతా ప్ర‌చండ దీప వెలుతురుతో స్పందించింది.  క‌రోనా దుష్ట‌శ‌క్తిని పార‌ద్రోలేందుకు దేశ ప్ర‌జ‌లంతా గత రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపారాధ‌న చేశారు.  కాంతి జ‌గ‌తికి క్రాంతి, శాంతి ప్ర‌సాదిస్తుందని భావిస్తాం. ఇవాళ మెరిసిన‌ ప్ర‌మిద‌ల ప్ర‌కాశం.. ఈ ప్ర‌పంచానికి కొత్త వెలుగునిస్తుందని ఆశిద్దాం. 

కరోనా మహమ్మారిపై  జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి  ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి దంపతులు, ఉపరాష్ట్రపతి దంపతులు,  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీపాలు వెలిగించారు. దేశ ప్రజలంతా తమ ఇళ్ల ముంగిట, బాల్కనీల్లో దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా తమ నివాసాల్లో జ్యోతులు వెలిగించారు.  

తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు కెసిఆర్. వైఎస్ జగన్, గవర్నర్లు తమిళిసై సౌందర్ రాజన్, బిశ్వభూషణ్ హరిచందన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాని మాతృమూర్తి హీరాబెన్‌, కేంద్ర మంత్రులు,  అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు,  ప్రజాప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. 

 ‘‘కరోనా చీకటికి, సంక్షోభానికి మనం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ తో  చాలామంది ఇంట్లోఒంటరిగా ఉన్నా మన్న ఫీలింగ్తో ఉన్నారు. కానీ 130 కోట్ల మంది భారతీయులు వారందరితో ఉన్నారనే  నైతిక మద్దతు కలిగించాలి” అని ఈ నెల 3న వీడియో సందేశంలో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.  

దాన్ని చాటేలా.. ఎవరి ఇంటికి వారు పరిమితమై దివ్వెలు వెలిగించారు. కష్టకాలం లో మేమంతా ఒక్కటేననే స్ఫూర్తిని చాటారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ చేపట్టాలని, కరోనాపై పోరాడుతున్న డాకర్టకు, త్యవసర సిబ్బందికి ఆ రోజు సాయంత్రం 5గంటలకు చప్పట్లతో సంఘీభావం తెలుపాలని ప్రధాని పిలుపునివ్వగా.. యావత్దేశం స్పందించింది. 

మార్చి24న రాత్రి 8 గంటలకు ఆయన జనం ముందుకు వచ్చి.. అదే రోజు అరరాత్రి నుంచి 21రోజుల పాటు  లాక్‌డౌన్   అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.  లాక్‌డౌన్  అమల్లోకి వచ్చిన తొమ్మిదిరోజుల తర్వాత ఈ నెల 3న వీడియో సందేశం విడుదల చేశారు.  లాక్‌డౌన్    కాలంలో ఇండ్లకే జనం పరిమితమవడంతో వారిలో ఒంటరి భావన ఉంటుందని భావించిన ప్రధాని.. దియా కార్యక్రమానికి పిలుపునిచ్చారు.