కరోనా కట్టడిపై మోదీ, ట్రంప్ సంభాషణలు 

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తున్నక్ర‌మంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోదీ టెలీఫోన్ సంభాషణ జరిపారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఇద్ద‌రి మ‌ధ్య సుధీర్ఘ చ‌ర్చ జ‌రిగింది.  ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.  

క‌రోనాపై పోరులో  క‌లిసిక‌ట్టుగా స‌ర్వశ‌క్తులు ఒడ్డేందుకు నిర్ణ‌యించుకున్నట్లు ప్ర‌ధాని వివ‌రించారు. ట్రంప్ తో సుధీర్ఘంగా సాగిన చ‌ర్చ‌లో ఇరుదేశాల భాగ‌స్వామ్యంతో క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు  నిర్ణ‌యించామ‌ని తెలిపారు. 

కాగా క‌రోనా దెబ్బ‌కు అమెరికా విలవిల్లాడుతున్నది. ఇప్పటి వరకు అక్కడ 2.79 లక్షల మంది కరోనా బారిన పడగా.. 7,451 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారత్‌లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. 

వైద్య సామగ్రి కోసం ప్రపంచ దేశాల సాయాన్ని అమెరికా కోరుతోంది. కాగా, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోతోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కరోనాపై రెండు దేశాలు కలిసి పోరాడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు.