ఆయుష్మాన్‌ లబ్ధిదారులకు ప్రైవేటులో చికిత్స

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన లబ్ధిదారులకు ప్రైవేటులాబ్స్‌లలో, ఎంపికచేసిన దవాఖానల్లో కరోనాకు ఉచితంగా పరీక్షలు, చికిత్స అందించనున్నట్టు నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ)  ప్రకటించింది. 

కరోనా పరీక్షలు, చికిత్స ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఉచితంగా లభిస్తున్నప్పటికీ, ఆరోగ్య భీమా లబ్ధిదారులకు అవకాశం కల్పించడంతో మరో 50 కోట్ల మంది పౌరులు ప్రైవేటు వైద్యరంగంలో ఉచిత సేవలు పొందుతారని పేర్కొన్నది. 

కరోనాపై పోరులో ప్రైవేటుసంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించటం ద్వారా.. ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేయగలమని మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.