ప్రతీ ఒక్కరు మాస్క్  కట్టుకోవలసిందే 

దేశంలో క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో మాస్క్ ధార‌ణ  విష‌యంలో కేంద్రం కీల‌క సూచ‌న చేసింది. ఇన్ని రోజులు ఉన్న భిన్నాభిప్రాయాల‌కు కేంద్రం తెర‌దించింది. కొందరు మాస్కులు కట్టుకోవడం తప్పనిసరి అంటూ వుంటే.. మరికొందరు మాస్కులు ప్రతీ ఒక్కరికి అవసరం లేదని చెబుతున్నారు. 

అయితే వీటిపై  కేంద్రం చాలా స్పష్టమైన ప్రకటన చేసింది. ఇల్లు దాటి బయటికి వెళ్ళే ప్రతీ ఒక్కరు మాస్కు కట్టుకుని తీరాలని సూచించింది. లాక్ డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాత కొన్నాళ్ళ పాటు మాస్కులు లేకుండా ఇల్లు వదలి రావద్దని తెలియజేసింది. 

లాక్ డౌన్ ముగియడానికి ఇంకా 11 రోజులు మిగిలి వున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా ఒక స్పష్టత కలిగించిట్లయ్యింది.  

ఇలా  ఉండగా,ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని మెరుగ్గానే నియంత్రించామని ప్రభుత్వం తెలిపింది. మిగతా దేశాల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరిగాయని, కానీ భారత్‌లో పరిస్థితి అంత ఘోరంగా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

భారత్‌లో కరోనాను కొంతమేర నియంత్రించగలిగామని, దీనికి ముందు చూపుతో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణమని ఆయన పేర్కొన్నారు. కాగా, దేశంలో ఇప్పటికి 3,072  కరోనా కేసులు నమోదవగా, 75 మంది బాధితులు మృత్యువాత పడ్డారు.