ఏపీలో 190కి చేరిన కరోనా కేసులు

ఏపీలో శనివారం ఉదయం 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా తాజాగా మరో 10 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 190కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. 

కొత్తగా కృష్ణా జిల్లాలో 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. జిల్లాల వారిగా నెల్లూరు, కృష్ణాలో అత్యధికంగా 32, గుంటూరు 26, వైఎస్సార్‌ కడప 23, ప్రకాశం 19, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 15, చిత్తూరు 10, తూర్పు గోదావరి 11, అనంతపురంలో 3 పాటిజివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

ఇక ఏపీలో కరోనా మృతుల సంఖ్య రెండుకి చేరింది. శుక్రవారం విజయవాడలో తొలి కరోనా మృతి నమోదు కాగా.. శనివారం ఉదయం హిందూపూర్‌కు చెందిన కరోనా బాధితుడు మృతి చెందారు.