కరొనపై కఠిన చర్యలకు కేసీఆర్ వెనుకడుగు 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ అదుపు తప్పుతున్నట్లు అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదై, మొత్తం కేసులు 74కు చేరుకోవడంతో దిగ్బ్రాంతికి గురవుతున్నారు. తెలంగాణలోని మొత్తం పాజిటివ్ కేసులలో మూడోవంతో నగరం పరిధిలోనివే. పైగా మృతులలో సహితం అత్యధికంగా నగరం నుండే ఉన్నారు. 

ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో ఈ వైరస్ ఉనికి ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజు నుండే నిజాముద్దీన్ లోని తాబ్లిఘి జామాతి ముంది తిరిగి వచ్చిన వారు పెద్ద ఎత్తున వైరస్ బారిన పదిన్నట్లు బైట పడుతూ ఉండడంతో గత నాలుగు రోజులలో మొత్తం పాజిటివ్ కేసులు రెండింతలు పైగా పెరిగాయి. 

అయినా ఇప్పటికి చాలామంది ముస్లింలు  స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షకు సహకరించడం లేదని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లేఖల కన్నా రెండింతల మంది ఢిల్లీ నుండి తిరిగి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తమకు స్వేచ్ఛ ఇస్తే వారందరిని జల్లెడ ఆడి పట్టుకొంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

వెంటనే కఠిన చర్యలు తీసుకోనని పక్షంలో హైదరాబాద్ నగరాన్ని ఈ మహమ్మారి కాటేయడం తధ్యం అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి సన్నిహిత రాజకీయ మిత్రుడు కావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. 

ఈ విషయంలో కఠినంగా వ్యవహరింప వలసిందే అని ఆయన కుమారుడు, మునిసిపల్ పాలన శాఖ మంత్రి కెటి రామారావు కూడా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. లేని పక్షంలో దేశంలో చాల రాష్ట్రాలకన్నా ముందునుండే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేసీఆర్ చేస్తున్న కృషి అంతా బూడిద కాగలదని ఆందోళన చెందుతున్నారు. 

ఇంకా చాలామంది బైటకు రాకుండా గోప్యంగా ఉంటున్నారని, వారి గురించిన వివరాలు ఇవ్వడానికి వారి బంధువులు కూడా ఇష్ట పడటం లేదని, కరోనా చికిత్సకు వచ్చిన వారు సహితం వైద్య బృందాలపై అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు వైద్య బృందాలకు సహకరింపమని ఒవైసి సోదరులు ముస్లిం సోదరులకు పిలుపు ఇవ్వక పోవడం గమనార్హం.