కరోనా మృతుల జాబితాలో 133వ స్థానంలో భారత్ 

భారతదేశంలో కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్త గణాంకాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. దేశ జనాభాలో ప్రతి పది లక్షల మందిలో ఒక్కరు కరోనా పాజిటివ్‌గా నమోదయ్యారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా సగటున చూస్తే మిలియన్‌కు 120కు పైగా పాజిటివ్ కేసులు చోటుచేసుకుంటున్నాయి. 

ఇక కరోనా మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సగటున పదిలక్షలలో ఆరుగురు చనిపోగా, భారత్ లో  ఈ మరణాలు పదిలక్షలలో 0.04గా నిర్థారణ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను నమోదు చేస్తున్న వెబ్‌సైట్ వరల్డ్‌మీటర్ రూపొందించిన గణాంకాల సమాచారంతో ఈ విషయం స్పష్టం అయింది.

జనసాంద్రత అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే ఇండియాలో కరోనా ప్రభావం కనిష్ట స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 208 దేశాల కేసులలో మృతుల సంఖ్యలో ఇండియా 133వ స్థానంలో ఉంది. 

చైనాలో పుట్టిన కరోనా శరవేగంగా వ్యాపించి ఐరోపా దేశాలను కుమ్మేసింది. ప్రతి మిలియన్ ప్రాతిపదికన ఎందరు మృతి చెందారనే లెక్కన రూపొందించిన జాబితాలో ఐరోపా  దేశాలే ఇప్పుడు ముందు వరుసలో ఉన్నాయి. ఇటలీ, స్పెయిన్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రా న్స్, స్విట్జర్లాండ్, బ్రిటన్‌లు అగ్రస్థానంలో నిలిచాయి. ఆసియాదేశాలలో ఇరాన్ ఒక్కటే ఈ జాబితాలోని మొదటి 20 దేశాల వరుసలో ఉంది. ఇక అమెరికాలో అత్యధిక సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నట్లు వెల్లడైంది. కరో

కరోనా వైరస్ తక్కువగా సోకిన 25 దేశాలలో భారతదేశం కూడా ఒక్కటిగా ఉంది. వైరస్ సంక్రమణల క్రమాన్ని విశ్లేషిస్తే భారత్  178వ స్థానంలో ఉంది. ఇతర ఆసియా దేశాలలో  బంగ్లాదేశ్, నేపాల్‌లలో సగటున 0.3, 0.2 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రస్ అధ్నామ్ గెబ్రెయెసస్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా  చూస్తే కరోనా సోకిన మొత్తం కేసులలో మృతుల సంఖ్య 3.4 శాతంగా ఉందని తెలిపారు.