త‌బ్లిగీ జామాత్‌తో 14 రాష్ట్రాల‌కు క‌రోనా

ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జ‌మాత్ నిర్వ‌హించిన మ‌త ప్రార్థ‌న‌ల కార‌ణంగా దేశంలోని 14 రాష్ట్రాల‌కు క‌రోనా వైర‌స్ పాకింది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు తబ్లిగీ జ‌మాత్‌కు హాజ‌రైన వారిలో 647 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌ని, మిగ‌తా వారికి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, మ‌రి కొంద‌రి రిపోర్టులు రావాల్సి ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యాద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. 

దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,301కి చేరింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హమ్మారి బారిన‌ప‌డి 56 మంది మ‌ర‌ణించార‌ని ల‌వ్ అగ‌ర్వాల్ చెప్పారు. గ‌త 24 గంట‌ల్లో 12 మంది చ‌నిపోయార‌ని, వారిలోనూ త‌బ్లిగీ జ‌మాత్‌కు హాజ‌రైన వారు ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. కాగా, 360 మంది త‌బ్లిగీ జ‌మాత్ కార్య‌క‌ర్త‌ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు కేంద్రహోంశాఖ వెల్ల‌డించింది. 

కాగా, గత 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 102 కరోనా కేసులు నమోదు కాగా వాటిలో 100 కేసులు తబ్టీగీ జమాత్‌కు హాజరైనవారే. మిగిలిన ఇద్దరు ఇటీవలే అమెరికాకు వెళ్లివచ్చినవారని వైద్యాధికారులు వెల్లడించారు.