ఏపీలో 132కు చేరిన కరోనా కేసులు 

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది.   బుధవారం ఒక్క రోజే 67 పాజిటివ్​ కేసులు నమోదు కాగా, బుధవారం రాత్రి మరో 21 కేసులు నమోదయ్యాయి. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య  132కు  చేరుకుంది. ఈ మొత్తం కేసుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ మర్కజ్​ సంబంధించినవే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసుల సంఖ్యలో పొరుగున ఉన్న తెలంగాణ(105)ను ఏపీ మించిపోయినట్లయింది. 

సోమవారం వరకు ఏపీలో 23కే పరిమితమైన కరోనా కేసులు.. రెండు రోజుల్లోనే 132కు చేరుకున్నాయి.  తాజా కేసుల్లో బాధితులంతా ఢిల్లీ వెళ్లొచ్చిన వారు,  వారి కుటుంభం సభ్యులు​, సన్నిహితులే కావడంతో వారందరిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి​ పెట్టింది. ఢిల్లీ నుంచి ఈ నెల 20, 21వ తేదీల్లో రాష్ట్రానికి వచ్చిన వారేక్కడెక్కడ తిరిగారు? వారెంత మందిని కలిశారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.   

గుంటూరు జిల్లాలోనే అత్య‌ధికంగా 20 కేసులు న‌మోదయ్యాయి. క‌డ‌ప 15, కృష్ణా 15, ప్ర‌కాశం 15, ప‌.గో 14, విశాఖ 11, తూ.గో జిల్లాలో 11 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

చిత్తూరు 6, నెల్లూరు 3, అనంత‌పురం 2, క‌ర్నూలు జిల్లాలో ఒక్క‌రికి క‌రోనా సోకింది. మొత్తం ఇవాళ న‌మోదైన కేసుల‌తో తెలంగాణ కంటే ఏపీలోనే క‌రోనా బాధితుల సంఖ్య పెరిగింది.