స్వీయ నిర్బంధంలో వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. 

కాగా పుతిన్ ప్రతిరోజు కోవిడ్-19 టెస్ట్ చేయించుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అద్భుతంగా ఉందని ప్రభుత్వ అధికార ప్రతినిధి డ్మిట్రీ పెస్కోవ్ తెలిపారు. 

అయితే వారం రోజుల క్రితం పుతిన్ పర్యటించిన కరోనా వైరస్ ఆసుపత్రి చీఫ్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన అనంతరం పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సదరు డాక్టర్‌తో కలిసి పుతిన్ ఆసుపత్రి వార్డులన్నీ తిరిగారు. అయితే ఇది జరిగిన వారం రోజులకే ఆయనకు కరోనా ఉందని తేలడంతో పుతిన్ ఆత్మరక్షణలో పడ్డారు.