బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి నడ్డా

బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాశ్ నడ్డాను నియమించారు. తెలంగాణ ఎన్నికలను బీజేపీ సవాల్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బీజేపీ కీలకనేత, కేంద్రమంత్రి జయప్రకాశ్ నడ్డాను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు.

హిమాచల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికైన నడ్డాకు సమర్థవంతమైన నేతగా పేరుంది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నియామకాల్లో కూడా నడ్డా కీలకంగా వ్యవహరించారని చెబుతారు. నడ్డా వంటి కీలకమైన నేతకు బాధ్యతలు అప్పగించడంతోనే తెలంగాణ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తేలిపోయింది. సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఇప్పటికే సంతోష్‌ను నియమించారు.  

2014లో బిజెపి అద్యక్షుడిగా అమిత్ షా నీయమకం జరిగిన సమయంలో తొలుత ఆ పదవికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నడ్డా పేరు తెరపైకి వచ్చింది.  తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్దీకరణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నడ్డాను ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించారు. రాజకీయాలలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా నడ్డా ,బీజేపీ అధిష్టానం అప్పగించిన భాధ్యతలను సమర్దవంతంగా నిర్వ హించారు. 

ఇపుడు బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించడం ఆయన సమర్దతను, ఆయన పోరాట పటిమను గుర్తించడమేనని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల మంత్రాంగాన్ని రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి అని పార్టీలో పేరుంది.