మార్కజ్ మజీదు వైరస్ పై రాష్ట్రాల అప్రమత్తత 

ఈ నెల రెండో వారంలో ఢిల్లీలో నిజాముద్దీన్ మార్కజ్ మజీదులో వేలాదిమందితో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న వారిలో  పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడినట్లు వెలుగులోకి రావడంతో తమ రాష్ట్రాలకు చెందిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యంగా నైనా  అప్రమత్తం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో  75 దేశాల నుంచి భారీ సంఖ్యలో  మత బోధకులు పాల్గొన్నారు. వీరిలో  ఒక ఇండోనేషియా నుంచే 1800 మంది పాల్గొన్నట్లు వెల్లడైనది. 

చాల రాష్ట్రాల్లో నమోదైన కరోనా పాజిటివ్ అయినా కేసులలో ఎక్కువగా ఈ ప్రార్థనలకు హాజరైన వారే అని తెలియడంతో మరింతగా ఆందోళన చెందుతున్నారు.  

ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా హాజరై, తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకున్నారని తెలుస్తున్నది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆరుగురికి కరోనా సోకినట్లు శుక్రవారం తేలిందని, వీరంతా ఢిల్లీ కారక్రమానికి వెళ్లి 24వ తేదీన కోల్‌కతా మీదుగా పోర్ట్‌బ్లెయిర్‌ చేరుకున్న వారే. 

ఈ కార్యక్రమానికి హాజరై రైలులో వచ్చిన జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గురువారం 65 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. తమిళనాడులో ఇటీవల మృతిచెందిన ఒకరు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లి వచ్చినట్లు తేలింది. తమిళనాడులో సోమవారం నిర్ధారణ అయిన కేసుల్లో నిజాముద్దీన్‌ కార్యక్రమా నికి వెళ్లి వచ్చిన కులితలై ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందడం తెలిసిందే. 

దేశం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తికి ఇదే కేంద్రమని వెల్లడి కావడంతో అరవింద్ కెజిర్వాల్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. క‌రోనాపై ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌కుండా ప్రార్థ‌న‌లు జ‌ర‌పడంపై ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ప‌రిగ‌ణించారు. 

వెంటనే ఆ నిజాముద్దీన్ మార్కజ్ మజీదును మూసి వేసి దాన్ని చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి, మజీద్ బోధకుడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.  ఈ ప్రాంతంలోని పలు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రజల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచారు.

ఈ ప్రాంతానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం  కూడా వచ్చి, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను ప్రారంభించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మొత్తం హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని రసాయన ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారని, ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది ఇక్కడ హాజరయ్యారు. వీరిలో ఎవ్వరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు జరిపించుకొనక పోవడంతో .ప్రభుత్వాలకు సమస్య గా మారింది. వారలందరిని గుర్తించేందుకు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ నుండి 1030 మంది, ఏపీ నుండి 730 మంది వెళ్లిన్నట్లు ప్రభుత్వాలు ఇప్పటి వరకు గుర్తించాయి. 

ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఇప్పటివరకూ 24 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. మార్కజ్ బిల్డింగ్‌లో జరిగిన ఈ మత ప్రార్థనలకు ఢిల్లీ నుండి 1500 నుంచి 1700 మంది వరకూ హాజరయినట్లు అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. 

ఇప్పటివరకూ 1033 మందిని గుర్తించి వారిలో 330 మందిని లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించినట్లు సత్యేంద్ర వివరించారు. 700 మందిని ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఉన్న క్వారంటైన్ సెంటర్స్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.