తబ్లిగీ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్న ఆరుగురు మృతి 

ఢిల్లీలో నిజాముద్దీన్‌ ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్‌'   మసీద్ లో మార్చి 1-15 మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కు గురై, కొందమంది మృతి కూడా చెందుతున్నారు. కేవలం తెలంగాణలోని ఆరుగురు మృతి చెందారు. ఈ కార్యక్రమాలో విదేశాల నుంచి పలువురు హాజరు కావడంతో, వారి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందిన్నట్లు భావిస్తున్నారు. దానితో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై, ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి కోసం అన్వేషణ ప్రారంభించాయి. 

తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల నుంచి వందలమంది ఇందులో పాల్గొన్నారు. ఈ మత కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణవాసుల్లో ఆరుగురు ఇటీవల మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి వివరాలను తమకు అందజేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది.

అదే విధంగా ఏపీలో కూడా దాదాపు ప్రతి జిల్లా నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికి ఆరుగురికి వైరస్ సోకిన్నట్లు నిర్ధారణ జరిగింది. అయితే పలువురు బైట పడక పొడవంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వివిధ జిల్లాల్లో 500 మందిని పైగా ఆసుపత్రులకు లేదా హోంక్వారంటైన్‌లకు తరలించారు.  

మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గీజ్‌స్థాన్‌, చైనా, ఇంగ్లండ్‌, శ్రీలంక దేశాలకు చెందిన దాదాపు వందమంది  విదేశీయులు ఈ ప్రార్థనల కోసం మర్కజ్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరైన వారిలో ఆరుగురు ఆ తరువాత కొద్దిరోజులకు మరణించారు. వీరిలో ఇద్దరు గాంధీ దవాఖానలో, ఒకరు అపోలో, ఒకరు గ్లోబల్‌ దవాఖానలో, నిజామాబాద్‌, గద్వాలలో ఒక్కొక్కరు మరణించారు. వీరందరికీ కరోనా సోకినట్లు తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. 

రెండురోజుల క్రితం ఖైరతాబాద్‌ ప్రాంతంలో చనిపోయిన వృద్ధుడు కూడా వీరిలో ఒకరు. ఇతను కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇతనికి కరోనా ఉన్నట్లు చనిపోయిన తరువాత నిర్ధారణ అయింది. మిగిలిన అయిదుగురు కూడా కరోనాతోనే మరణించి ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నది. వీరి ద్వారా వైరస్‌ సోకే అవకాశం ఉన్నదని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోనిత్యే ప్రక బృందాలు గుర్తించి, దవాఖానలకు తరలిస్తున్నాయి. వారందరికీ పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు.

ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్యఆరోగ్యశాఖ కోరింది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలని, వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని వైద్యారోగ్యశాఖ విజ్ఞప్తిచేసింది. 

ఏపీ నుంచి హాజరైన వారి ద్వారా ఆ రాష్ట్రంలో కూడా కరోనా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో పాజిటివ్‌గా తేలిన ఇండోనేషియా వాసులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వచ్చినట్టు అనుమానిస్తున్నారు. మర్కజ్‌ ప్రార్థనల్లో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ముస్లింలు, మత బోధకులు పాల్గొనడంతో కరోనా వ్యాప్తి పై దేశ వ్యాప్తంగా ఆందోళన పెరిగింది.  

ఇప్పటికే ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో రెండువేల మందిని క్వారంటైన్‌కు తరలించారు. నిజాముద్దీన్‌ ప్రాంతానికి చెందిన ఓ బృందంలోని 175 మందికి పలు దవాఖానల్లో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీకి చెందిన 300 మందిని వివిధ దవాఖానలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మార్చి 15న ప్రార్థనలు పూర్తయినప్పటికీ.. 1400 మంది ఇంకా మసీదులోనే ఉండిపోయారు. వీరందరికీ కరోనా పరీక్షలు జరుపుతున్నారు.  

మర్కజ్‌ భవనంతో సహా నిజాముద్దీన్‌ ప్రాంతాన్ని ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకొన్నాయి. స్థానికుల కదలికలపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. చుట్టుపక్కల కాలనీల్లో ప్రతి ఇంటికీ వెళ్లి.. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. శ్రీనగర్‌కు చెందిన మతబోధకుడు గతవారం కరోనా వైరస్‌ వల్ల మరణించాడు. ఢిల్లీలో ప్రార్థనలకు హాజరైన తర్వాత అతడు ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన మత కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్లు తెలిసింది.

మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు కూడా చనిపోయాడు. అతనికి కరోనా ఉన్నదీ లేనిదీ నిర్ధారణ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే షేక్‌ మహ్మద్‌ ముస్తఫాతోపాటు పదిమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముస్తఫా బంధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరికొందరు దేశంలోని పలు ప్రాంతాలకు తిరిగి వెళ్లడంతో వారి వల్ల ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశమున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. యూపీ, ఈశాన్య రాష్ట్రాల వారికీ సోకినట్లు అనుమానిస్తున్నారు. 

దక్షిణ ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్‌లో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురిలో కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కాగా, తెలంగాణాలో సోమవారం కరోనా వైరస్‌తో మరొకరు మృతిచెందారు. కొత్తగా 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐసొలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నవారిలో 13 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటికే ఒకరిని డిశ్చార్జ్‌ చేయగా, మిగిలిన 61 మందికి వైద్యసేవలు అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.