2019 ఎన్నికల్లో చంద్ర గ్రహణాన్ని పారదోలుదాం

రాష్ట్రానికి `చంద్రగ్రహణం’ పట్టినదని అంటూ, దానిని 2019 ఎన్నికలలో పరదోలుదామని పార్టీ కార్యకర్తలకు బిజెపి ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు పిలుపిచ్చారు. శ్రీకాకుళంలో పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ బూత్‌ కమిటీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి మండలంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌లు తయారు చేయాలని సూచించారు. వాటితో . రాష్ట్రంలో టీడీపీని తరిమేద్దాం’’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అసలైన యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని అంటూ 2019 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుదామని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. చంద్రబాబును గుంటూరు మిరపకాయపై కూర్చోపెడతామని స్పష్టం చేసారు. మోసానికి మారుపేరే చంద్రబాబు నాయుడు అంటి తీవ్రంగా విమర్శలు కురిపిస్తూ ఆయన బీజేపీ రాష్ట్రానికి మోసం చేసిందంటూ పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీలో రోడ్ల నిర్మాణానికే రు 1.16 లక్షల కోట్లను కేంద్రం ఇచ్చిందన్నాని చెబుతూ స్వాతంత్య్రం వచ్చాక ఎవరూ కేటాయించనంతగా ఏపీకి మోదీ ప్రభుత్వం భారీగా నిధులు కుమ్మరించిందని తెలిపారు. పైగా రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేసారు. ఇంతచేసినా బీజేపీ మోసం చేసిందంటూ సీఎం పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని ద్వజమెత్తారు.

ఆనాడు తెలుగు ప్రజలను అవమానించిన కాంగ్రెస్ ను మట్టికరిపించాలని స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అంటూ కాంగ్రెస్ నుండి వచ్చి టిడిపిలో చేరిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రె్‌సతో దోస్తీ చేస్తూ రాహుల్‌ గాంధీతో ఫొటోలు దిగుతున్నారని ఎద్దేవా చేసారు. రాహుల్‌ గాంధీ నాయకత్వ బాధ్యతలు వహించిన రాష్ట్రాల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని చెబుతూ ఇప్పుడు ఆ పార్టీతో టీడీపీ దోస్తీ చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని దయ్యబట్టారు.

బీసీల కోసం ఎన్‌సీబీసీని, ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదింపజేసిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేసారు. ఇప్పుడు టిడిపి, కాంగ్రెస్ జత కట్టేందుకు సన్నాహాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక పోయిన చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్దపడుతున్నారని పేర్కొన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుని టీడీపీ లబ్ధి పొందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కాంగ్రె్‌సతో పొత్తు కుదుర్చుకున్న దొంగలు ఏపీకి అవసరం లేదని చెప్పారు. తిరిగి అధికార్మలోకి రావాలనే ఉద్దేశ్యంతో గాలి దీక్షలు చేస్తున్నారని బీజేపీ విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అంటూ నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు వైఖరి బయటపడిందని తెలిపారు. టీడీపీకి ఓటు వేయని వారి పేర్లు ఓటర్‌ లిస్ట్‌ నుంచి తొలగించారని ఆరోపించారు. కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.