తెలంగాణ నేతల, ఉద్యోగుల జీతాల్లో భారీ కోత 

లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ పన్నుల వసూళ్లు ఆగిపోవడం, మరోవంక అత్యవసర సేవలకు వ్యయం పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి నుండి సాధారణ అటెండర్ వరకు చెల్లించే జీతాలతో భారీ కోతలు విధించింది. కనీసం 10 శాతం కాగా, అత్యధికంగా 75 శాతం వరకు కోత విధించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా  వివిధ రకాల చెల్లింపులపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసకున్నారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రకార్పొరేషన్‌ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత

ఆలిండియా సివిల్‌ సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత

మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత 

నాలుగవ తరగతి, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత 

అన్ని రకాల రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత 

నాలుగో తరగతి రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత 

అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధింపు

ప్రభుత్వ గ్రాంటు పొంందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత