దూర‌ద‌ర్శ‌న్ లో తిరిగి శ‌క్తిమాన్ సీరియ‌ల్‌

క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణలో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఇంట్లో వారికి కాలక్షేపం జరిగే విధంగా గతంలో విశేషంగా ప్రజాదరణ పోంసిన సీరియల్స్ ను దూర‌ద‌ర్శ‌న్  పునఃప్ర‌సారం చేస్తోంది. 

ఇప్ప‌టికే రామాయ‌ణం  ఎపిసోడ్స్ ప్ర‌సారం చేస్తుంది. అయితే రామాయ‌ణం పెద్ద‌లు మాత్ర‌మే చూస్తుండగా...చిన్న‌పిల్ల‌ల కోసం శ‌క్తిమాన్ సీరియ‌ల్‌ను మ‌ళ్లీ ప్ర‌సారం చేయ‌నుంది. శ‌క్తిమాన్ సీరియ‌ల్  తొలిసారి 1997లో ప్రారంభమై 2005 వరకు ప్రసారమైన ఈ సీరియ‌ల్ అప్ప‌ట్లో ఎంతో ఆద‌ర‌ణ పొందింది. 

అటు ఈ సీరియ‌ల్ పునః ప్ర‌సారంపై శక్తిమాన్‌ హీరో ముఖేష్‌కన్నా స్పందిస్తూ క‌రోనా ఉన్న క‌ష్ట‌కాలంలో ఇళ్లల్లో ఉన్న ప్ర‌జ‌లంద‌రూ భార‌త ఇతిహాస గ్రంథ‌మైన రామాయ‌ణం చూసే అవ‌కాశం మ‌రోసారి ల‌భించిందని పేర్కొన్నారు. 

దీంతో పాటుగా మీ అంద‌రికీ ఎంతో న‌చ్చిన శ‌క్తిమాన్ సీరియ‌ల్ కూడా డీడీలో ప్ర‌సారం కాబోతుందని, ఇందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అయితే శ‌క్తిమాన్ ఏ స‌మ‌యంలో ప్ర‌సారం కాబోతుందో చూడాల‌ని చెప్పారు. 

పైగా, ప్రస్తుతం ప్రసారం చేస్తున్న సీరియల్స్ షూటింగ్ ఆగిపోవడంతో పలు ఛానల్స్ పాత భాగాలనే తిరిగి ప్రసారం చేస్తున్నారు.