లాక్‌డౌన్‌ పొడిగించే ఆలోచన లేదు

మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తారన్న ప్రచారం అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది.  ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు పుకార్లను నమ్మొద్దని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా తెలిపారు. 

లాక్ డౌన్ ను పొడిగించాలనే ఆలోచనేమి చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా  అమలవుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారని అయాన్ పేర్కొన్నారు.

ప్రజలను భయాందోళనలకు గురిచేసే ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1171కి చేరగా, 31 మంది మరణించారు.