పాకిస్తాన్ లో హిందువుల పట్ల వివక్షత 

కరోనా మహమ్మారి పాకిస్తాన్‌ను వణికిస్తోంది. వందలాదిమంది కరోనా బారిన పడుతున్నారు. ఇటువంటి సమయంలో కూడా ఆ దేశ ప్రభుత్వం తమ దేశంలోని మైనారిటీల పట్ల, ముఖ్యంగా హిందువుల పట్ల వివక్షత చూపుతున్నది. 

పాక్ ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే  హిందువులపై వివక్ష చూపుతూ, వారికి రేషన్ ఇవ్వడం లేదు. ఈ ఘటన సింధ్ రాష్ట్రంలోని కరాచీ నగరంలో చోటు చేసుకుంది. కరోనా సంక్షోభం దృష్ట్యా ముస్లింలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ, హిందువులకు ఇవ్వడం లేదు. ఈ రేషన్ ముస్లింలకు మాత్రమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

లాక్ డౌన్ పలు నేపథ్యంలో  కార్మికులకు రేషన్ ఇవ్వాలని సింధ్ ప్రభుత్వం ఆదేశించింది. మానవ హక్కుల కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హిందువులకు రేషన్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. 

ఇంతేకాదు  ప్రజలు గుమిగూడి ఉంటున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లియారి, సచల్ ఘోత్, కరాచీలోని ఇతర ప్రాంతాలతో పాటు సింధు అంతటా హిందువులకు రేషన్ ఇవ్వడం లేదని తెలిపారు.