డిజిటల్ చెల్లింపులు సురక్షితం  

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ప్రజలకు వీడియో సందేశమిచ్చారు. ప్రజలందరూ కరోనా వైరస్ ప్రబలకుండా ముందుజాగ్రత్తగా డిజిటల్ చెల్లింపులు చేస్తూ సామాజిక దూరం పాటించాలని శక్తికాంతదాస్ సూచించారు. 

‘‘కరోనా వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, వివిధ మొబైల్ యాప్‌లతో డిజిటల్ చెల్లింపులు చేయండి, సురక్షితంగా ఉండండి’’ అని ఆర్బీఐ గవర్నరు విడుదల చేసిన వీడియో సందేశంలో కోరారు.  

కరోనా కట్టడికి 21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ డిజిటల్ బ్యాంకింగ్ సాయంతో చెల్లింపులు చేయాలని సలహా ఇచ్చారు. కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 1100మార్కును దాటిందని మహమ్మారీ కమ్యూనిటీ ట్రాన్సిషన్‌తొ ప్రవేశించే దశలో ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

‘‘కరోనావైరస్ వ్యాప్తి కారణంగా మనందరం చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో, మనం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’’ అని గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.