జిల్లాల సరిహద్దులు మూసివేతకు కేంద్రం ఆదేశం 

క‌రోనా వ్యా‌ప్తి‌ని నిరోధించేందుకు దేశం అంతా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. రాష్ట్రాల సరిహద్దులతో పాటు జిల్లాల సరిహద్దులను కూడా మూసివేయమని కేంద్రం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేవ‌లం నిత్య‌వ‌స‌ర స‌రుకులకు మాత్రమే అనుమ‌తి ఇవ్వా‌ల‌ని స్పష్టం చేసింది. 

ఇప్ప‌టికే స‌రిహ‌ద్దు‌లు దాటిన వారిని 14 రోజుల పాటు క్వా‌రంటైన్‌లో ఉంచాల‌ని సూచించిది. నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా ప్ర‌యాణం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. 

 లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం  కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గూబా జరిపిన   వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని స్పష్టం చేసారు. 

రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  అత్యవసర విపత్తుల చట్టం కింద ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ బాధ్యతను తమ భుజాలకెత్తుకోవాలని  ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపంది  పట్టణాలలో పనిచేస్తున్న లక్షలాది మంత్రి వలస కార్మికులు అక్కడ ఇప్పుడు పనులు లేకపోతూ ఉండడంతో గ్రామాలకు ప్రయాణం కావడం పట్ల కేంద్రం ఆందోళన చెందుతున్నది. కరోనా వైరస్‌ ఆయా గ్రామాలకు విస్తరించకుండా వారందర్నీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో  రాజీవ్ గూబా రాష్ట్రాలకు సూచించారు