సామజిక దూరం... భాగాత్మక దూరం కాదు 

కరొనపై పోరాటంలో గెలుపొందడానికి ప్రజలు సామాజిక దూరం పాటించాలని, కాని భావాత్మక దూరం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హితవు చెప్పారు.  ఆదివారం ఆయన మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ దినసరి కూలీలు పడుతున్న కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని పేరోన్నారు. ప్రపంచ పరిస్థితులు చూశాకే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇది జీవన్మరణ పోరాటమని స్పష్టం చేశారు.

 కరోనా వ్యతిరేక పోరాటం కఠినమైనది చెబుతూ అందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని ప్రధాని స్పష్టం చేశారు. రోగం వచ్చినప్పుడే చికిత్స చేయాలి, లేదంటే ఇబ్బందులొస్తాయని చెబుతూ భారత  ప్రజలను సురక్షితంగా ఉంచడమే  నేడు అత్యవసరం అని తెలిపారు. 

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగించాలని ఎవ్వరు అనుకోరని, అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంగిస్తున్నారని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఆ విధంగా చేయడం వల్లన కరోనా ప్రమాదం నుండి మనలను మనం కాపాడుకోవడం సాధ్యపడదని ప్రధాని హెచ్చరించారు. "తీసుకొంటున్న కఠిన చర్యల వల్లన మీలో చాలామందికి అసౌకర్యం కలుగుతూ ఉండవచ్చు, అందుకు కొందరు నాపై ఆగ్రహంతో ఉండవచ్చు. వారందరిని క్షమాపణ కోరుతున్నాను. కానీ కరొనపై జరుపుతున్న పోరాటంలో గెలవాలంటే ఇవ్వన్నీ తప్పనిసరి"  అని తెలిపారు. 

హితవు చెప్పారు. ఎవరికో సాయం చేసేందుకు లాక్‌డౌన్‌లో పాల్గొనడంలేదని, ప్రజల రక్షణ కోసమే దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. కరోనా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదని చెబుతూ కొందరు ఇప్పటికీ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవడంలేదని విచారం వ్యక్తం చేశారు. 

ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తే ఇతరులకు ఇబ్బంది తప్పదని మోదీ వ్యాఖ్యానించారు.  కరోనా వైరస్‌ అందరికీ సమానమేనని, పేద, ధనిక అనే తేడాలేదని ప్రధాని మోదీ చెబుతూ కరోనాపై మనం చేస్తున్న యుద్ధం గెలిచి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన లక్ష్మణరేఖను ఎవరూ దాటొద్దని సూచించారు. 

లాక్‌డౌనే కరోనా వైరస్‌ నివారణకు పరిష్కార మార్గమని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకే ముప్పుని పేర్కొంటూ కరోనా వైరస్‌ను జయించినవారు మనకు స్ఫూర్తిప్రదాతలని ప్రధాని వ్యాఖ్యానించారు. కరోనా మానవత్వానికి సవాల్‌ విసురుతోందని, కరోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పారు. 

ప్రజలు సంయమనంతో ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాని హెచ్చిరించారు.  అందరూ ఏకమై కరోనాపై యుద్ధం చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు, స్వీయ నియంత్రణ పాటించాల్సిదేనని స్పష్టం చేశారు.మరికొన్నిరోజుల పాటు 'లక్ష్మణ రేఖ' దాటకుండా ఉండాల్సిందేనని ప్రధాని మోదీ తెలిపారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని పిలుపు ఇచ్చారు. 

కరోనా వైరస్‌ కట్టడికి వైద్యులు, నర్సులు...ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి ప్రధాని ఘనంగా కొనియాడారు. నిస్వార్ధంగా, ప్రమాదం అంచున కూడా వారందిస్తున్న సేవలను కొనియాడడానికి తనకు మాటలు రావడం లేదని అంటూ పాదార్థికమైన ప్రతిఫలం ఆశించకుండా రోగులకు సేవలు అందించే వారే ఉత్తమ వైద్యుడు అని ఆచార్య చార్వాక చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచం 2020ని అంతర్జాతీయ నర్సుల సంవత్సరంగా జరుపుకొంటున్న సందర్భంగా అనూహ్యమైన  అంకిత భావంతో పనిచేస్తున్న నర్సులకు ప్రధాని అభినందనలు తెలిపారు.