అందరికి నగదు లభించేటట్లు చూస్తా 

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ్యాప్తంంగా జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్లు తీసుకొంటున్న చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు/  సకాలంలో అందరినీ నగదు లభ్యత ఉండేలా చూడడానికి వీలుగా తాను బ్యాంకర్లందరితో మాట్లాడుతానని ఆ,ఏ చెప్పారు. 

నగదు, బ్యాంకర్లు, వ్యాపారులు, లేదా బ్యాంక్ మిత్రల కదలికలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని తాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతానని కూడా ఆమె తెలిపారు. ‘దేశవ్యాప్తంగా బ్యాంక్ మిత్ర/ బ్యాంకింగ్ కరస్పాండెంట్లు చేస్తున్న సేవలను అభినందిస్తున్నా. వారి కదలికలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని అన్ని రాష్ట్రాలను కోరుతాను'అని ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడం కోసం గత వారం ప్రభుత్వం పేదలకు, వయో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు నేరుగా నగదు బదిలీ సహా పలు చర్యలను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ కష్ట సమయంలో బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కృషిని అభినందించాల్సిన అవసరం ఉందని కూడా నిర్మలా సీతారామన్ తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు.