ఏపీలో 16కు చేరిన కరోనా కేసులు 

ఏపీలో శ‌నివారం మ‌రో ముగ్గురికి క‌రోనా వైర‌స్ సోకింది. ప్ర‌కాశం జిల్లా దంప‌తుల‌కు, క‌ర్నూలు జిల్లాలో ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 16కు చేరింది.

కర్నూలు జిల్లా సంజామల మండ‌లం నొస్సం గ్రామంలో రాజస్థాన్ కు చెందిన 23ఏళ్ల‌ యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌డి నమూనాలు సేక‌రించి ప‌రీక్షించ‌గా క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. అత‌డు ఇటీవ‌లే రాజ‌స్థాన్ వెళ్లి అక్క‌డి నుంచి రైలులో క‌ర్నూలుకి వ‌చ్చాడు. 

క‌ర్నూలు నుంచి బ‌స్సులో నొస్సం గ్రామానికి చేరుకున్నాడు. అయితే వ‌చ్చిన త‌ర్వాత జ్వ‌రం, త‌ల‌నొప్పి స్థానిక ఆస్ప‌త్రికి వెళ్లాడు. అక్క‌డ డాక్ట‌ర్ స‌ల‌హాతో 108లో క‌ర్నూలు జీజీహెచ్ కు చేరాడు. అత‌డికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో నొస్సం గ్రామంలో మూడు కిలోమీట‌ర్ల ప‌రిధి మేర క‌రోనా జోన్ గా ప్ర‌క‌టించి స‌ర్వైలెన్స్ లోకి తీసుకున్న‌ట్లు క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ వీర‌పాండ్య‌న్ తెలిపారు. 

ఇక ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని నవాబు పేటకు చెందిన భార్యభర్తలకు కరోనా వైర‌స్ సోకింది. వాళ్లిద్ద‌రూ ఇటీవ‌ల ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కు రైలులో వ‌చ్చి, అక్క‌డి నుంచి బ‌స్సులో చీరాల‌కు చేరుకున్నారు. వీరి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఒంగోలు రిమ్స్ కు త‌ర‌లించారు. అయితే వీరితో కాంటాక్ట్ అయిన వారంద‌రినీ క్వారంటైన్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు కర్నూల్ లు తొలి కరోనా ఆకేసు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో వీటి సంఖ్యా మూడుకు చేరింది. 

కాగా కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం  రేపటి నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పును పంపిణీచేయనుంది. ఇది కాక ఏప్రిల్‌ నెలలో 15వ తేదీన, 29వ తేదీన మరో రెండు సార్లు ఉచితంగా బియ్యం, కంది పప్పును ఇచ్చే విధంగా సన్నద్ధమవుతోంది. ఉన్నతాధికారులతో  జరిపిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు.