తెలంగాణలో తొలి క‌రోనా మృతి!

గత రెండు రోజులుగా తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండగా, శనివారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను వైరస్ సోకిన వ్యక్తి అని గుర్తించడం ఆందోళన కలిగిస్తున్నది. 

చాపకింద నీరు వలే హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ కొన్ని వర్గాలలో సోకున్నట్లు వెల్లడి అవుతున్నది. ముఖ్యంగా వీరిలో పలువురు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు కావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. 

కరీంనగర్ లో పెట్టుబడిన వైరస్ సోకిన10 పది మంది ఇండోనేషియా పౌరులు సహితం ఢిల్లీ వైపు నుండి వచ్చినవారే కావడం కారణం. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, నిరసనలతో వీరికి ఏమైనా సంబంధం ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

తెలంగాణలో శుక్రవారం 10, శనివారం 6 పాజిటివ్ కేసులు పెరగడంతో మొత్తం కేసులు 65కు చేరుకున్నాయి. నిన్న‌ కుత్బుల్లాపూర్ లో ఒకే కుటుంబంలో న‌లుగురికి, ఇవాళ ఒక్క రోజులో పాత బ‌స్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుకి క‌రోనా సోకింద‌ని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత క‌రోనా ఉన్న‌ట్లు తేలింద‌ని చెప్పారు.   

హైద‌రాబాద్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్ లో 74 ఏళ్ల వృద్దుడు ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో చేరి, అక్కడ చికిత్స పొందుతుండ‌గానిమోనియా వ‌చ్చి  అతి తీవ్రం కావ‌డంతో మ‌ర‌ణించాడు. అయితే ఆ వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత ఆస్ప‌త్రి సిబ్బందికి అనుమానం వ‌చ్చి మృత శరీరాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ క‌రోనా కార‌ణంగానే చ‌నిపోయిన‌ట్లు తేలంద‌ని  మంత్రి ఈట‌ల‌ చెప్పారు. 

చనిపోయిన వృద్ధుడు ఖైరతాబాద్ నివాసి కాగా మార్చ్ 14న మతపరమైన కార్యక్రమాలకు ఢిల్లీకి వెళ్లి, 17న నగరానికి తిరిగి వచ్చారని చెబుతున్నారు. మొదటగా కానీ నొప్పి వస్తే ఒక నేత్ర వైద్యశాలకు వెళ్ళాడు. మార్చ్ 20న  20న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో అతడిని  సైఫాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి, గురువారం ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత కుటుంభ సభ్యులు ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా చనిపోయిన్నట్లు ధృవీకరించారు. 

ఆసుపత్రి అధికారులు సైఫాబాద్ పోలీస్ లకు తెలపడంతో, వారు గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మునిసిపల్ అధికారులు అతని భార్య, కుమారుడిని కూడా స్వీయనిర్బంధంపై పంపి ఖైరతాబాద్ ప్రాంతం అంతా అప్రమత్తం చేశారు. 

ఇండోనేషియా నుండి గత నాలుగు నెలలో నాలుగు బృందాలు ఈ ప్రాంతంలో తిరిగిన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడం గమనార్హం. వైరస్ కు గురవుతున్న పలువురికి ఢిల్లీ అల్లర్లతో గల సంబంధాలు, వారికి నిషేధ సంస్థలతో గల సంబంధాల గురించి ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.