భారత్ కు అమెరికా రూ 21.7 కోట్ల సహాయం 

కోవిడ్-19తో యుద్ధం చేయడానికి 64 దేశాలకు 174 మిలియన్ డాటర్లు (1300 కోట్ల రూపాయలు) ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్ డాటర్లకు (750 కోట్ల రూపాయలు) అదనం అని అమెరికా పేర్కొంది. 

ఈ మొత్తంలోభారత్ కు 2.9 మిలియన్ డాలర్లు (21.8 కోట్ల రూపాయలు) రానున్నాయి.   కొత్తగా ప్రకటించిన సహాయం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) సహా పలు విభాగాలు, ఏజెన్సీల్లో అమెరికన్ గ్లోబల్ రెస్పాన్స్ ప్యాకేజీలో భాగంగా అందించినట్లు అమెరికా పేర్కొంది.

 ప్రపంచ మహమ్మారి కరోనా ముప్పును తీవ్రంగా ఎదుర్కొంటున్న 64 దేశాలల్లో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇక భారత్ కు  కేటాయించిన రూ  21.8 కోట్లతో ప్రయోగశాల ఏర్పాటు, కరోనా కేసు కనుగొనే వ్యవస్థ, ఈవెంట్-ఆధారిత నిఘా పటిష్టం, సాంకేతిక నిపుణులకు మద్దతు ఇవ్వడానికి సహా మరికొన్ని ఇతర పనులకు అందిస్తున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.

ఈ సందర్భంగా అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌ బోనీ గ్లిక్‌ మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు చేసే సహాయంలో అమెరికా సరికొత్త రికార్డును నెలకొల్పిందని పేర్కొన్నారు.

 ‘‘ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నో దశాబ్దాలుగా అమెరికా ప్రపంచ దేశాలకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంది. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. వివిధ జాతులు, వర్గాల ప్రజలను కాపాడుకునేందుకు వీలుగా ఆరోగ్య సంస్థలను నెలకొల్పేందుకు సహాయం అందించింది’’ అని తెలిపారు. 

ఇక అమెరికా ప్రకటించిన గ్లోబల్‌ ప్యాకేజీ ద్వారా శ్రీలంకకు 1.3 మిలియన్‌ డాలర్లు, నేపాల్‌కు 1.8 మిలియన్‌ డాలర్లు, బంగ్లాదేశ్‌కు 3.4 మిలియన్‌ డాలర్లు, అఫ్గనిస్తాన్‌కు 5 మిలియన్‌ డాలర్లు దక్కనున్నాయి.