పూర్తిగా కరోనా చికిత్సకే గాంధీ ఆసుపత్రి 

హైదరాబాద్ లోని ఆసుపత్రిని పూర్తిగా కరోనా బాధితుల చికిత్స కొరకు వినియోగించాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోన వైరస్ వ్యాప్తి మూడవ దశకి చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రతలపై ఆయన వైద్యాధికారులతో సమీక్ష సమావేవం నిర్వహిస్తూ విదేశాల నుండి వచ్చిన వారిని, వారితో కలిసిన ఇతరులను పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని  ఆదేశించారు. 

హాస్పిటల్స్‌లో పనిచేసే వైద్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వొద్దని, చికిత్సకు కావాల్సిన అన్ని పరికరాలను సమీకరించుకోవాలని సూచించారు. విదేశాల నుండి వచ్చే వారిని స్క్రీన్ చేయడం, హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి పరీక్షలు చేయడం లాంటి కార్యక్రమాలతో పాటు సిఎం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడతాయని వివరించారు. 

కాగా, తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కొనియాడారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన రాష్ట్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ తెలంగాణలో కరోనా నివారణ కోసం ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని మెచ్చుకున్నారు. రాబోయే రెండు వారాలు కీలకమైనవని తెలిపారు.