హైదరాబాద్ వైద్య దంపతులకులు కరోనా 

తెలంగాణలో మొదటిసారిగా ఇద్దరు వైద్యులు కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లోని దోమలగూడలో ఉండే దంపతులైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరుకున్నాయి.  కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా వచ్చిందని తెలిపింది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తితో కలిసి ఉండడంతో కుత్బుల్లాపూర్ వ్యక్తికి కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు.  

దోమ‌ల‌గూడ‌కు చెందిన 41 ఏళ్ల డాక్ట‌ర్, ఆయ‌న భార్య (36)కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ దంప‌తులిద్ద‌రూ డాక్ట‌ర్లే కావ‌డం కొంత ఆందోళ‌నకు కార‌ణ‌మ‌వుతోంది. వీరిద్ద‌రూ హైద‌రాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిట‌ల్ లో ప‌ని చేస్తున్నార‌ని, ఇటీవ‌ల ఢిల్లీ, తిరుప‌తి ప్ర‌యాణాలు చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది.

వారు ఈ ప్రాంతాల‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ఆస్ప‌త్రిలో ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ల వివ‌రాలు, వారు ఎవ‌రెవ‌రిని క‌లిశార‌న్న స‌మాచారం తెలుసుకుని అంద‌రినీ క్వారంటైన్ చేసే ప‌నిలో ప‌డ్డారు ప్ర‌భుత్వ అధికారులు.  

ఇవాళ న‌మోదైన మూడు క‌రోనా కేసులూ లోక‌ల్ ట్రాన్స్ మిష‌న్ ద్వారానా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురికీ విదేశీ ప్ర‌యాణం చేసిన ట్రావెల్ హిస్ట‌రీ లేదు.  రాష్ట్రంలో తొలి పేషెంట్ అయిన సికింద్రాబాద్ యువ‌కుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.