తెలుగు రాష్ట్రాల సమన్వయ లోపంతో అవస్థలు 

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎంతటి సాన్నిహిత్యం నెలకొన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాల మధ్య తగు సమన్వయవెల్లడి మంది అవస్థలకు గురవుతున్నారు. లాక్ డౌన్ వంటి అత్యవసర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇటువంటి లోపాలు వేలాదిమందికి ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. 

లాక్ డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్ లోని హాస్టళ్లు,  ఉద్యోగులు, విద్యార్థులను అతిధులుగా ఆశ్రయం ఇచ్చే వారు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ఒకేసారి వేలాది మంది రోడ్లపై పడ్డారు. వారంతా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని తమ గోడు చెప్పుకున్నారు. దానితో వారు ఆంధ్ర ప్రదేశ్ లోని తమ స్వస్థలాలకు వెళ్ళడానికి పాస్ లు ఇవ్వడానికి అంగీకరించారు. 

ఆ పాస్ లు తీసుకొని కారులు, ద్విచక్రవాహనాలు వంటి అందిన వాహనాలను పట్టుకొని బయలుదేరితే ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులలో ఏపీ పోలీసులు వారిని ఆపివేశారు. రాష్ట్రంలో ప్రవేశించడానికి వీల్లేదని స్పష్టం చేయారు. దానితో రాత్రి పొద్దుపోయే వరకు వారంతా సరిహద్దులో రహదారులపై పడిగాపులు పడవలసి వచ్చింది. 

వాస్తవానికి లాక్‌డౌన్‌కు ముందు నుంచే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. డు రాష్ట్రాల పోలీసులు అటూ ఇటూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 

బుధవారం వాహనాలు ఒక్కొక్కటిగా తెలంగాణ చెక్‌పోస్టులు దాటి ఏపీలోకి ప్రవేశించదాంతో ఎందుకు, ఎట్లా వచ్చారంటూ విస్తుపోవడం ఏపీ పోలీసుల వంతయింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా లోపలకు రానిచ్చేడిది లేదని  స్పష్టం చేశారు. ముందే తెలంగాణ పోలీస్ అధికారులు ఏపీ పోలీస్ అధికారులతో ప్రదించి ఉంటె ఈ సమస్య వచ్చెడిది కాదు. 

సుమారు ఎనిమిది గంటల పాటు రహదారులపై వేచి ఉండవలసి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిని అనుమతించడంపై ఏపీ అధికారులు తీవ్ర తర్జనభర్జనలు పడ్డారు. వారిలో ఎవరికి కరోనా పాజిటివ్‌  ఉన్నా పెద్ద ‘రిస్క్‌’ చేసినట్లవుతుందని, ఇలాంటి సమయంలో రిస్క్‌ తీసుకోలేమని, పూర్తిస్థాయిలో స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసిన తర్వాతగానీ ఏపీలోకి అనుమతించరాదని నిర్ణయించారు. 

హైదరాబాద్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించిన వారిని వెనక్కి పంపించలేక, అలాగని నేరుగా ఇళ్లకూ పంపించలేక మార్గాంతరం అన్వేషించారు. చివరికి కృష్ణా, గుంటూరు జిల్లాలవారిని బస్సుల్లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలించారు. 

తూర్పుగోదావరి జిల్లావారిని రాజమండ్రిలో క్వారంటైన్‌కు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లావారిని తాడేపల్లిగూడం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించారు.  అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు. 

ఇంతలో ఈ సమస్య గురించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడగా హాస్టళ్లను మూసివేయవద్దని తెలంగాణ డిజిపి మహేంద్ర రెడ్డి ఆదేశాలు జారీచేశారు.