జనగణన, ఎన్పీఆర్‌ వాయిదా

కరోనా ప్రభావంతో  జనగణన, జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్‌) నమోదు ప్రక్రియలను కేంద్రం నిరవధికంగా వాయిదా వేసింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు జరుగాల్సిన జనగణన, ఎన్పీఆర్‌ నమోదు ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత జనగణన కమిషన్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ప్రకటించారు. 

2020-21 జన గణ నలో భాగంగా దేశవ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకు గృహ గణన ప్రక్రియ చేపట్టాలి. రెండవ విడతగా వచ్చే ఏడాది ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి 28 వరకు జన గణన జరుగాల్సి ఉన్నది.