కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ తధ్యం : కన్నా

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అందులో వచ్చే కమీషన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరాట పడుతున్నారని ఆయన ఆరోపించారు.

కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. రాయలసీమలో టిడిపికి ఎక్కువ సీట్లు రాలేదనే కోపంతోనే ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని కన్నా ఆరోపించారు.

వందశాతం నిధులిచ్చిన పోలవరంపై మాత్రమే ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్న సీఎం మిగిలిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. చెన్నూరు చక్కెర కర్మాగారం, ప్రొద్దుటూరు, చిత్తూరు పాలడైరీలనను వెంటనే తెరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.