సామాజిక దూరం అమ‌లు చేసిన కేంద్ర మంత్రివర్గం 

సామజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోగలమని దేశ ప్రజలకు చెబుతూ, మూడు వారల పాటు దేశ దిగ్బంధనానికి పిలుపిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మంత్రివర్గ సమావేశం జరిపే సమావేశంలో అమలు జరిపారు. 

సాధారణంగా మంత్రులందరూ కలసి వృత్తాకారంలో కూర్చోవడం కాకుండా ఒక పెద్ద హాలులో ఒకరికొక్కరు దూరంగా కూర్చొంటూ సమావేశం జరిపారు. ఒక్కో మంత్రి క‌నీసం మూడు మీట‌ర్ల దూరం పాటిస్తూ కూర్చున్నారు. 

ఈ స‌మావేశంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, దేశ వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న లాక్ డౌన్ పై చర్చించారు. తద్వారా దేశ ప్రజలకు ఆచరణలో కేంద్ర మంత్రులు ఒక సందేశం ఇచ్చిన్నట్లు అయింది. 

ఇలా ఉండగా, గురువారం తమిళనాడులో ఒకరు, బెంగళూరులో ఒకరు  కరోనాతో చనిపోయారు. దీంతో  భారత్ లో కరోనా మృతుల సంఖ్య 11కి చేరగా..పాజిటివ్ కేసుల సంఖ్య 584 కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఆ తర్వాత స్థానంలో కేరళలో 109 పాజిటివ్ కేసులు,కర్ణాటక 41, తెలంగాణ 39,గుజరాత్ లో 38 పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాఠశాలలను ఇప్పటికే మూసివేసిన  తమిళనాడు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వార్షిక పరీక్షలు రాసే అవసరం లేకుండానే పై తరగతుల్లో చేరే వెసులుబాటును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. 

అంతేకాదు, మార్చి 24న జరిగిన ప్లస్2 పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు మరో రోజు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా 1 నుంచి 9వ తరగతి లోపు విద్యార్థులకు జరగాల్సిన వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ, వారందరూ ఉతీర్ణులైన్నట్లే అని ప్రభుత్వం ప్రకటించింది.  వెల్లడించింది.