రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల భారీ అమెరికా ప్యాకేజీ  

క‌రోనా వైర‌స్ మహమ్మారితో కకావికలం అవుతున్న అమెరికా ప్రజలను ఆదుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం భారీ ఆర్ధిక ప్యాకేజీని రూపొందించింది.  అమెరికా చరిత్రలోనే  కాకూండా, దేశం కూడా ఇప్పటి వరకు ఎటువంటి సంక్షోభ సమయంలో అందీయని భారీ స్థాయిలో 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని తయారు చేశారు. 

ఈ ప్యాకేజి ద్వారా భారీ కార్పొరేట్ సంస్థలు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, కార్మికులు, నిరుద్యోగులు, ఆరోగ్య సేవలు అందించే వారితో పాటు దాదాపు ప్రతి అమెరికా పౌరుడికి కూడా నేరుగా నగదును బదిలీ చేస్తారు. ప్ర‌తి ఒక వ్య‌క్తికి ప్యాకేజీ కింద వ్యక్తులకు 1200 డాల‌ర్లు, దంపతులకు 2,400 డాలర్లు, నలుగురు సభ్యుల కుటుంబానికి 3,000 డాలర్లు చొప్పున ఇస్తారు. 

కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇంటి వద్ద ఉండిపోగా, వారికి జీతాలు ఇవ్వడం కోసం 500 మంది లేదా అంతకన్నా తక్కువ మంది ఉద్యోగులు గల కంపెనీల కోసం 367 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. 

ఒకొక్క కంపెనీకు 10 మిలియన్ డాలర్ల వ్యాపార రుణాలు ఇస్తారు. వారానికి 600 డాలర్లు చొప్పున నాలుగు నెలల వరకు నిరుద్యోగ భృతిని ఇస్తారు. ఆరోగ్య సేవలు, సామజిక సేవలు అందించే వారి కోసం 242 మిలియన్ డాలర్లు వ్యయం చేస్తారు.