ఐటీ రిటర్న్‌, జీఎస్టీ దాఖలుకు గడువు... ఉచిత ఎటీఎం సేవలు 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నదృష్ట్యా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రజలకు పలు సదుపాయాలను ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలుకు చివరి తేదీని జూన్‌ 30 వరకూ పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 30 వరకూ ఉంది.  లాక్‌డౌన్‌ సమయంలో ఈ చర్యలు సామాన్య ప్రజలకు కొంత మేర ఊరట కల్పిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 

పాన్‌, ఆధార్‌ లింకింగ్‌కు డెడ్‌లైన్‌ను కూడా మార్చి 31 నుంచి జూన్‌ 30 వరకూ పొడిగించారు. ఇక ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామని మంత్రి వెల్లడించారు.  బ్యాంకుల ఎటీఎంల నుండి నగదు ఉపసంహరణ చార్జీలను తీసివేయడంతో పాటు, సేవింగ్ బ్యాంకు ఖాతాలలో కనీస మొత్తం నిబంధనను తొలగించారు. 

రూ. 5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపు ఆలస్య రుసుములు ఉండవని ఆమె స్పష్టం చేశారు.   ఆదాయ పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. టీడీఎస్‌ జమలో ఆలస్య రుసుమును కూడా  18 నుంచి 9 శాతానికి తగ్గించారు. 

రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువు జూన్‌ 30వ తేదీ వరకు పొడిగించారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగించారు. మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్‌ 30 వరకు పొడిగించారు. 

కాంపొజిషన్‌ స్కీమ్‌ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్‌ 30 గడువు విధించారు. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం ఉండవని వెల్లడించారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. 

డెబిట్‌ కార్డుదారులు ఇక నుంచి ఇతర ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు అయినా నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ అవకాశం వచ్చే మూడు నెలల దాకా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వను ఉంచాలనే అంశంలో ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇకపై బ్యాంకింగ్‌ ఛార్జీలను కూడా తగ్గిస్తారు.